ISRO: తొలి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ విజయవంతం
ISRO: భారత వ్యోమగాములను అంరిక్షంలోకి పంపే లక్ష్యంతో భారత్ చేపట్టిన గగన్‌యాన్ లో భాగంగా భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) అనేక పరీక్షలు నిర్వహిస్తోంది. తాజాగా మరో టెస్టు విజయవంతంగా నిర్వహించింది. క్రూ మాడ్యూల్ కు సంబంధించిన తొలి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్టు (IADT-01)ను ఆదివారం విజయవంతంగా ప్రయోగించింది. నౌకాదళం, వాయుసేన , డిఆర్‌డిఒ, కోస్ట్‌గార్డ్‌ల సంయుక్త సహకారంతో ఈ పరీక్షలు చేపట్టినట్లు సమాచారం.
హెలికాప్టర్ సహాయంతో మాడ్యూల్ నమూనాను నింగిలోకి తీసుకుని వెళ్లి, కిందికి జారవిడుస్తారు. ఆ మాడ్యూల్ పారాచూట్ల సాయంతో వేగాన్ని నియంత్రించుకుంటూ.. సముద్ర జలాల్లో సురక్షితంగా దిగింది. మానవసహిత అంతరిక్ష ప్రయోగాల సమయంలో వ్యోమగాములు భూమికి సురక్షితంగా వచ్చేందుకు ఉపయోగిస్తారు. 2027లో తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర నిర్వహించనున్నట్లు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఇటీవల వెల్లడించారు.
Also Read: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్న తొలి నటుడు

[…] […]