నేటి నుండి తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల జారీ

తిరుమల (CLiC2NEWS): తిరుమల తిరుపతి దేవస్థానంలో మంగళవారం నుండి సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్ల జారీ ప్రక్రియను ప్రారంభించినట్లు ఈఓ ఎవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతిలోని భూదేవి, కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, గోవిందరాజస్వామి సత్రాల వద్ద ఈ టోకెన్లు జారీ ప్రక్కియను నిర్వహించనున్నారు. శని, ఆది, సోమవారాల్లో 25వేల టోకెన్లు, మిగతా రోజుల్లో 15వేలు చొప్పున టోకెన్లు జారీ చేస్తామన్నారు. టోకెన్ అందిన వ్యక్తి అదేరోజు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారలు తెలిపారు. టోకెన్లు దొరకని భక్తులు తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా శ్రీవారికి దర్శించుకొనే విధంగా ఏర్పాట్లు చేశారు. టోకెన్ పొందిన వ్యక్తి దర్వనం చేసుకున్నా,లేకపోయినా టోకెన్లు నెలకు ఒకసారి మాత్రమే పొందే అవకాశం ఉంది.