రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, గ్రానైట్ వ్యాపారుల ఇళ్లలో ఐటి,ఇడి సోదాలు..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఐటి, ఇడి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఆదాయపన్ను అధికారులు సోదాలు చేస్తున్నారు. మంత్రి నివాసంతో పాటు గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, ఆఫీసులలో ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని పంజాగుట్టలో ఉన్న పిఎస్ ఆర్ గ్రానైట్స్, హైదరగూడలోని జనప్రియ అపార్ట్‌మెంట్స్‌లలో తనిఖీలు నిర్వహించారు. సోమాజిగూడలోని గ్రానైట్ వ్యాపారి నివాసంలో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. సుమారు 20 మంది అధికారులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నారు. గ్రానైట్ వ్యాపారులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో ఈ సోదాలు చేపట్టినట్లు సమాచారం.
In some outrageously fancy and ludicrously
costly eating places, meals is not only a approach to nourish
your physique.