జాబ్ కంటిన్యూ చేస్తూ ఇంజినీరింగ్ చదివే అవకాశం..
పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారికి గుడ్‌న్యూస్
హైదరాబాద్ (CLiC2NEWS): పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారికి సదవకాశం. బిటెక్ చేయాలన్న కోరిక మీకుంటే.. ఉద్యోగం చేసుకుంటూ ఇంజినీరింగ్ చదువుకోవచ్చు. అటు ఉద్యోగాన్ని, చదువును కొనసాగించే సదవాకాశం కల్పిస్తున్నాయి కొన్ని కళాశాలలు.
మన రాష్ట్రంలో మొత్తం 12 కళాశాలలు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఉస్మానియా సహా పలు కళాశాలలకు వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ప్రవేశాలు కల్పించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి ()ఇటీవల అనుమతి నిచ్చింది.
మూడేండ్ల పాలిటెక్నిక్ (డిప్లొమా) పూర్తి చేసిన వారికి నేరుగా బిటెక్ రెండో సంవత్సరంలో ప్రవేశం ఉంటుంది. సాయంత్రం కాని.. వీకెండ్స్‌లో గాని తరగతులు నిర్వహిస్తారు. ఫీజులు ఆయా కాలేజీలను బట్టి ఉంటుంది. ఓయులో ఏడాదికి రూ. లక్షగా నిర్ణయించారు. ఈ కాలేజీలలో అడ్మిషన్లు పొందడానికి ఈనెల 30 వరకు అవకాశం ఉంది.