హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం అర్థ రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నగరంలోని ఖైరతాబాద్, పాతబస్తీ, ఛార్మినార్, చంద్రాయణగుట్ట, బార్కస్, కార్వాన్, గొల్కొండ, లంగర్ హౌస్, బహదూర్పురా, బేగంపేట, సికింద్రాబాద్, ప్యారడైజ్, అమీర్పేట, సనత్నగర్, ఎర్రగడ్డ, లక్డీకాపూర్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.
దీంతో జిహెచ్ ఎంసి అధికారులు రోడ్లపై నీరు నిలవకుండా చర్యలు చేపట్టారు. డిఆర్ డిఎ అధికారులను అప్రమత్తం చేసినట్లు జిహెచ్ ఎంసి అధికారులు తెలిపారు.