సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటి సోదాలు.. స్పందించిన నిర్మాత
హైదరాబాద్ (CLiC2NEWS): సినీ ప్రముఖుల ఇళ్లపై ఆదాయ పన్నుశాఖ (ఐటి) సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. నిర్మాత, రాష్ట్ర ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు ఇంట్లో మంగళవారం ఐటి అధికారులు సోదాలు చేస్తున్న సంగతి సంగతి తెలిసిందే. ఆయన నివాసం, కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ సోదాలు తాను ఒక్కడిపైనే కాదని.. ఇండస్ట్రీ మొత్తం మీద కొనసాగుతున్నాయని దిల్‌రాజు అన్నారు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్, మ్యాంగో మీడియా ఆఫీసుల్లో కూడా సోదాలు కొనసాగతున్నాయి. ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదు చేశాకే సోదాలు నిర్వహిస్తున్నారని.. మొత్తం 55 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపుల మధ్య తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బ్యాంకు లాకర్లను కూడా ఐటి అధికారులు తనిఖీ చేస్తున్నారు.