ఐటిఐలను అడ్వాన్స్‌డ్ అప్‌గ్రేడ్ ట్రైనింగ్ సెంటర్లుగా..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ, ఉపాధి అంశాలే కీలకమని .. నిరుద్యోగ యువతకు చేదోడుగా ఉండాలనే ఉద్దేశంతో ఐటిఐలను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆయన మల్లేపల్లి ఐటిఐలో ఎటిసిలకు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 65 ఐటిఐలను ఆధునాతనంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని త్వరలో చేపడతామన్నారు. ఐటిఐలను ఆడ్వాన్స్‌డ్ అప్‌గ్రేడ్ ట్రైనింగ్ సెంటర్లుగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 2,324.21 కోట్లు నిధులు ఖర్చుచేయనున్నట్లు తెలిపారు.
ఐటిఐలను ఎటిసిలుగా మార్చేందుకు టాటా బెక్నాలజిస్ లిమిటెడ్ తో అవగాహన ఒప్పందం కుదిరిందని.. ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా వాటిలో యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఎటిసిలలో శిక్షణ ఇచ్చేందుకు 130 మంది నిపుణులను ప్రభుత్వం నియమించిందని.. ఏటా 15,860 మందికి 6 రకాల కోర్సుల్లో లాంగ్‌టర్మ్ కోచింగ్ లభిస్తుందని తెలిపారు. అదేవిధంగా 31,200 మందికి 23 రకాల కోర్సుల్లో షార్ట్ టర్మ్ కోచింగ్ ఇవ్వనుంది. ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ. 307.96 కోట్లు కాగా.. టిటిఎల్ వాటా రూ. 2016.25 కోట్ఉల. ఎటిసిల్లో శిక్షణ పొందిన వారికి టిటిఎల్ ఉద్యోగవకాశాలు కల్పించనున్నట్లు సమాచారం.