సొంత ఇంటికి మ‌ళ్లీ వ‌చ్చినట్లు ఉంది: తుల ఉమ‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): తుల ఉమ త‌న అనుచ‌రుల‌తో క‌లిసి సోమ‌వారం బిఆర్ ఎస్‌లో చేరారు. బిజెపి వేముల‌వాడ టికెట్ ఇచ్చిన‌ట్టే ఇచ్చి.. త‌ర్వాత వేరే వారికి కేటాయించ‌డంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి కెటిఆర్ ఆమెను బిఆర్ ఎస్ లోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడుతూ.. బ‌ల‌హీన వ‌ర్గాల ఆడ‌బిడ్డ‌కు ఇటువంటి అన్యాయం జ‌ర‌గ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని.. టికెట్ ఇచ్చిన‌ట్టే ఇచ్చి గుంజుకోవం బాధాక‌ర‌మ‌ని అన్నారు. గ‌త హోదాకంటే కూడా మ‌రింత స‌ముచిత హోదాను, బాధ్య‌త‌ల‌ను ఆమెకు అప్ప‌గించి గౌరవించుకుంటామ‌ని మంత్రి కెటిఆర్ హామీ ఇచ్చారు.

త‌న‌కు వేములవాడ‌ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన‌ట్టే ఇచ్చి దొంగ దారిన ఇంకొక‌రికి కేటాయించ‌డం బిజెపి మాట‌కు క‌ట్ట‌బ‌డి ఉండ‌ద‌ని.. దానికి ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని తుల ఉమ అన్నారు. బిజెపి అగ్ర‌వ‌ర్ణాల పార్టీ అని.. బిజెపి బిసిల‌ను ముఖ్మ‌మంత్రి చేయ‌డం క‌ల‌నేన‌న్నారు. బిఆర్ ఎస్‌లో మొద‌టినుంచి ఉన్నాను. ఇక్క‌డ ఇచ్చిన గౌర‌వం బిజెపిలో ఇవ్వ‌లేద‌న్నారు. ఇపుడు త‌న సొంత ఇంటికి మ‌ళ్లీ వ‌చ్చిన‌ట్లు ఉంద‌ని ఆమె పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.