క్రికెటర్ సిరాజ్‌కు ఇంటిస్థలం కేటాయిస్తూ జిఒ జారీ: రాష్ట్ర సర్కార్

హైదరాబాద్ (CLiC2NEWS): క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం ఇంటిస్థలం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా అతనికి స్థలం కేటాయిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. టి20 ప్రపంచకప్ లో విజయం సాధించిన జట్టులో పేసర్ సిరాజ్ ఒకరు. ఆయన హైదరాబాద్ చేరుకున్న అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సిరాజ్‌ను అభినందించిన సిఎం సిరాజ్‌కు ఇంటిస్థలం , ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తాజాగా ఇంటి స్థలం కేటాయిస్తూ జిఒ జారీ చేసింది.