AP: వన్‌టైం సెటిల్‌మెంట్‌ పథకం అమలుకు ముఖ్య‌మంత్రి జగన్‌ ఆదేశం

అమరావతి (CLiC2NEWS): గృహ నిర్మాణ శాఖపై ఎపి సిఎం జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. వన్‌టైం సెటిల్‌మెంట్‌ స్కీంపై ముఖ్యమంత్రికి అధికారులు వివరాలు అందించారు. ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ నుంచి రుణాలు తీసుకున్న వారికి వన్‌టైం సెటిల్‌మెంట్‌ పథకం వర్తిస్తుంది. జగనన్న శాశ్వత గృహ హక్కు పథకంగా పేరు ఖరారు చేసిన అధికారులు.. కాగా పథకం అమలు కోసం రూపొందించిన విధి విధానాలపై సమావేశంలో చర్చించారు. ప్రతిపాదనలను సీఎంకు అధికారులు వివరించారు.

  • పేదలందరికీ ఇళ్ల నిర్మాణ ప్రగతిపై సీఎం సమీక్ష
  • ఇప్పటివరకూ గ్రౌండ్‌ అయిన ఇళ్లు 10.31 లక్షలు.
  • ఇళ్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశం
  • ఈమేరకు కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలన్న సీఎం
  • లబ్ధిదారులు ఎంచుకున్న ఆప్షన్‌ 3 కింద ప్రభుత్వమే కట్టించనున్న ఇళ్ల నిర్మాణ పనులు అక్టోబరు 25 నుంచి ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశం
  • ఈ ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులు, మేస్త్రీలతో కలిపి 18వేలకుపైగా గ్రూపులను ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడి
  • ఖర్చులు తగ్గించుకునే విధానాల్లో భాగంగా ఇళ్లనిర్మాణం జరుగుతున్న లే అవుట్ల వద్దే ఇటుక తయారీ యూనిట్లను ప్రోత్సహిస్తున్నామన్న అధికారులు
  • దీనివల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తున్నాయన్న అధికారులు
  • మిగిలిన నిర్మాణ సామగ్రి ధరలను, ఖర్చులను అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం

ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌ ఛైర్మన్‌ దవులూరి దొరబాబు త‌దిత‌ర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.