హెచ్‌సిఎ అధ్యక్షుడిగా జగన్‌మోహన్‌రావు విజయం..

హైదరాబాద్ (CLiC2NEWS): క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ) అధ్యక్షుడిగా యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సిఎ ప్యానెల్ అభ్యర్థి జగన్ మోహన్‌రావు విజయం సాధించారు. ఉపాధ్యక్షుడిగా గుడ్ గవర్నెన్స్ ప్యానెల్ దళ్జిత్ సింగ్ గెలుపొందారు. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో శుక్రవారం అసోసియేషన్‌కు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 173 మంది సభ్యులుండగా.. 169 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో హెచ్‌సిఎ ప్యానెల్ అభ్యర్థి జగన్ మోహన్ రావు ప్రత్యర్థి అమర్నాథ్‌పై రెండు ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఆర్‌టిసి ఎండి సజ్జనార్, జిహెచ్ ఎంసి కమిషనర్ రొనాల్డ్ రోస్‌తో పాటు వెంటపతిరాజు, మిథాలీరాజ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.