ఐసిసి ఛైర్మన్‌గా జైషా..

ఢిల్లీ (CLiC2NEWS): ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) నూతన ఛైర్మన్‌గా జైషా బాధ్యతలు స్వీకరించారు. ఐసిసి ఛైర్మన్‌గా ఎన్నికైన అతిపిన్న వయస్కుడిగా జైషా గుర్తింపు పొందారు. భారత్ నుండి ఈ బాధ్యతలు చేపట్టిన ఐదో వ్యక్తి జైషా. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుత ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న బార్క్‌లే పదవీకాలం ముగియటంతో జైషా ఎన్నికయ్యారు. శశాంక్ మనోహర్ తర్వాత ఈ పదవిని చేపట్టిన ఐదో భారతీయుడు జైషా. జగన్‌మోహన్ దాల్మియా, శరద్‌పవార్ ఐసిసి అధ్యక్షడిగా ఉన్నారు. 2016లో అధ్యక్ష పదవిని రద్దు చేసి ఛైర్మన్ పదవిని పునరుద్ధిరించారు.
ICC President:జగన్మోహన్ దాల్మియా 1997-2000
ICC President: షరద్‌పవార్ 2010-2012
ICC Chaiman: ఎన్.శ్రీనివాసన్ జులై 26, 2014-నవంబర్ 30,2015
ICC Chaiman: శశాంక్ మనోహర్ నవంబర్ 22,2015 – జూన్30,2020
ICC Chaiman: జైషా డిసెంబర్1,2024..
.