అంతర్జాతీయ కుంగ్‌పూ టోర్నిలో బంగారు పతకం సాధించిన జనగామ జిల్లా వాసి

జనగామ (CLiC2NEWS): నేపాల్‌లో జరిగిన నేషనల్ యూత్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ ఫెడరేషన్ ఇండియా ఐదవ అంతర్జాతీయ టోర్నమెంట్‌లో జనగామ జిల్లా వాసి స్వర్ణ పతకం సాధించాడు. జనగామ జిల్లా, బచ్చన్న పేటకు చెందిన చందు కొరియా క్రీడాకారుడిపై విజయం సాధించి పసిడి పతకం కైవసం చేసుకున్నాడు. వరంగల్‌లోని సైనిక్ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి ఆటో డ్రైవర్, తల్లి మొక్కజొన్న కంకులు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. గత సంవత్సరం గోవాలో జరిగిన జాతీయ స్థాయి టోర్నిలో రాణించిన చందు, నేపాల్ జరిగే చాంఫియన్‌షిప్ పోటీలకు ఎంపికయ్యాడు. అయితే తన దగ్గర అక్కడకు వెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో.. రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ఆర్ధి క సాయం అందించారు. స్థానికులు సైతం అతనికి అండగా నిలిచిరూ. 50వేలు సమకూర్చారు.