AP: ‘జలజీవన్ మిషన్ పథకం’ అమలు కాలాన్ని 2027 వరకు పొడింగించాలి
అమరావతి (CLiC2NEWS): డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. డిప్యూటిసిఎం పవన్‌కల్యాణ్ కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్‌తో సమావేశమయ్యారు. జల్‌జీవన్ మిషన్‌పథకం కింద కేవలం రూ.2కోట్లే వాడుకొందని.. ఇంకా రూ.16వేల కోట్లు వాడుకోవాలి. ఆ నిధులు ఉపయోగించుకోవడానికి సహకరించాలని కోరారు.ఈ పథకం అమలు కాలాన్ని 2027వరకు పొడిగించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.
అనంతరం పిఠాపురం పట్టణ పరిధిలోని రైల్వే లెవెల్ క్రాసింగ్ స్థానంలో అర్ ఒబిని ప్రధానమంత్రి గతిశక్తి కార్యక్రమం ద్వారా మంజూరు చేయాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను పవన్ కోరారు. అదేవిధంగా పిఠాపురంలోని శ్రీపాద వల్లభస్వామి ఆలయానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం నాలుగు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు పిఠాపురంలో హాల్ట్ ఇవ్వాలని కోరారు.
‘రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్’ పథకం కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని కేంద్ర పంచాయతీరాజ్ మంత్రి రాజీవ్‌రంజన్ సింగ్‌ను పవన్‌కల్యాణ్‌ను కోరారు. 2021 నుండి కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులు అందలేదు. ఈ పథకం కింద విడుదల చేయాల్సిన వాటిలో తొలి విడతగా రూ.107.90 కోట్లను వెంటనే విడుదల చేయాలని పవన్ విజ్ఞప్తి చేశారు.
మంగళవారం డిప్యూటి సిఎం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కలిశారు. ఈ సంర్బంగా ఆయన ఉపాధి పనులకు నిధులు పెంచాలని కేంద్రమంత్రిని కోరారు. ఉపాధిహామీ పథకంలో భాగంగా నిర్మిస్తున్న సిసిరోడ్లు, డ్రెయిన్లు , అంగన్ వాడీ, వ్యవసాయ ఉత్పత్తుల గిడ్డంగులు, మహిళా స్వయం సహాయక సంఘాల భవానాలకు అంచనా వ్యయం నిధులను పెంచాలని కోరారు. ఉపాధి పనుల్లో సిఎం ఆవాస్ యోజన ద్వారా ఇల్లు కట్టుకోవాడానికి 90 రోజులు పనిదినాలు ఉండా.. అదనంగా 100 పనిదినాలుకల్పించాలన్నారు. రాష్ట్రంలో 2,643 గ్రామాలకు అనుసంధాన రోడ్డు వేయాలని గుర్తిస్తే.. పిఎం గ్రామీణ సడక్ యోజన కింద 413 రోడ్ల నిర్మాణానికి మాత్రమే లభించిందని, మిగితా 2,230 గ్రమాలకు ఇంకా అనుసంధాన రోడ్లు వేయాల్సి ఉందని విన్నవించారు. గ్రామీణ సడక్ యోజన కింద గ్రామాల్లోని అంతర్గత దారులు కూడా బాగు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని పవన్ కల్యాణ్ మంత్రిని కోరారు.