జ‌మ్మికుంట త‌హ‌సీల్దార్ ఇంట్లో ఎసిబి సోదాలు.. 12 కోట్ల అస్తులు గుర్తింపు

వ‌రంగ‌ల్ (CLiC2NEWS): అక్ర‌మాస్తుల కేసులో జ‌మ్మికుంట త‌హ‌సీల్దార్‌ను ఎసిబి అధికారులు అరెస్టు చేశారు. హ‌నుమ‌కొండ కెఎల్ న‌గ‌ర్ కాల‌నీలోని ర‌జ‌ని ఇంటితో పాటు.. బంధువులు, స‌న్నిహితుల ఇళ్లో అధికారులు సోదాలు నిర్వ‌హించారు. మొత్తం రూ. 12 కోట్ల విలువైన ఆస్తుల‌ను గుర్తించారు. రెండంత‌స్తుల భ‌వ‌నం, రెండు చోట్ల ఇళ్ల స్థ‌లాలు, 7 ఎక‌రాల వ్య‌వ‌సాయ భూమి, రెండు కార్లు, 3 ద్విచ‌క్ర‌వాహ‌నాలు, బ్యాంకులో రూ. 25 ల‌క్ష‌ల న‌గ‌దు నిల్వ, కిలోన్న‌ర బంగారు ఆభ‌ర‌ణాలు గుర్తించారు. రేపు క‌రీంన‌గ‌ర్ ఎసిబి ప్ర‌త్యేక కోర్టులో త‌హ‌సీల్దార్‌ను హాజ‌రు ప‌ర‌చ‌నున్నారు.

Leave A Reply

Your email address will not be published.