శాసనసభ ఎన్నికల్లో 9 స్థానాల్లో జనసేన పోటీ

హైదరాబాద్ (CLiC2NEWS): బిజెపి, జనసేన మధ్య జరిగిన చర్చలు సఫలమై .. రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరంది. మొత్తం 9 స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది. ముందుగా 11 స్థానాల్లో పోటీచేయాలని నిర్ణయించినా.. తాజా చర్చల్లో 9 స్థానాలకు గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. పవన్‌కల్యాణ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో రెండు పార్టీల అభ్యర్థుల విజయానికి సమిష్టిగా పనిచేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఈ భేటీలో ఎంపి లక్ష్మణ్, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.