జనసేన-టిడిపి కలిసి పోటీ: పవన్ కల్యాణ్

రాజమహేంద్రవరం (CLiC2NEWS): రానున్న ఎపి అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ, జనసేన పర్టీలు కలిసి పోటీ చేస్తాయని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించాడు. గురువారం చంద్రబాబుతో భేటీ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటిచాడు పవన్. కాగా ఇవాళ రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైల్లో టిడిపి అధినేత చంద్రబాబుతో పవన్ కల్యాణ్, బాలకృష్ణ, నారాలోకేష్ కలిసి చంద్రబాబును కలుసుకున్నారు. ఈ ములాఖత్ అనంతరం పవన్ మాట్లాడుతూ.. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని విమర్శించారు. చంద్రబాబుకు, టిడిపికి సంఘీభావం ప్రకటించడానికే ఇక్కడికి వచ్చినట్లు పవన్ ప్రకటించారు. జగన్ మద్దతుదారులకు ఇంకా ఆరు నెలలే సమయం ఉందని అన్నారు. వాళ్లంతా యుద్ధమే కోరుకుంటే వాళ్లకు అదే ఇస్తామని ఈ సందర్భంగా అన్నారు. ఎపి సిఎం జగన్ అడ్డగోలుగా వ్యవహిస్తున్నారని పవన్ మండిపడ్డారు. అందుకే ఇవాళ బాలకృష్ణ, లోకేశ్ పక్కన నిల్చున్నాని అన్నారు. విశాఖలో నిరసన తెలిపినందుకే జనసేన నేతలపైకేసు నమోదు చేశారు. ఎపిలో వైఎస్సర్సీ దౌర్జన్యాన్ని అడ్డుకోవాలంటే విడివిడిగా పోటీ చేస్తే కుదరదు. అందుకే ఈ రోజు తిసుకున్ననిర్ణయం ఇది.. జనసేన, టిడిపిక ఎన్నికల్లో కలిసి వెళ్లాయి అని పవన్ ప్రకటించారు. ఈ సమావేశంలో పవన్‌తో పాటు బాలకృష్ణ, లోకేశ్, ఇతర జనసేన, టిడిపి నాయకులు పాల్గొన్నారు.