మోడీ ప్రధానిగా ఉన్నంత వరకు ఏ దేశానికి భారత్ తలొగ్గదు: జనసేనాని

ఢిల్లీ (CLiC2NEWS): విజనరీ నాయకుల బాటలో నడిచేందుకు సిద్దంగా ఉన్నట్లు జనసేనాని పవన్‌కల్యాణ్ తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన ఎన్‌డిఎ ఎంపిల సమావేశంలో టిడిపి అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ.. నరేంద్రమోడీకి జనసేన తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపి.. ప్రధాని మోడీ నాయకత్వానికి జనసేన పార్టి మద్దతిస్తుందని అన్నారు. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఆయన స్ఫూర్తిగా నిలిచారు. మోడీ ప్రధానిగా ఉన్నంత వరకు ఏ దేశానికి భారత్ తలొగ్గదన్నారు. మీ నేతృత్వంలో పనిచేయడాన్ని గర్వంగా భావిస్తున్నామని పవన్ లన్నారు.