డిహెచ్ఇడబ్ల్యూ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టుల భర్తీ
జనగామ (CLiC2NEWS): జిల్లాలోని జిల్లా హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ () కాంట్రాక్ట్ పద్దతిన ఉద్యోగాల భర్తీ కి ప్రకటన చేసింది. జిల్లా మిషన్ కో ఆర్డినేటర్, జెండర్ స్పెషలిస్ట్, ఫైనాన్షియల్ లిటరరీ స్పెషలిస్ట్, మల్లీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి పదో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు అని అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తుకు ఏప్రిల్ 29 తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు దరఖాస్తులను జిల్లా సంక్షేమాధికారి కార్యాలయం, స్త్రీ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, జనగామ జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సమాదాయం, జనాగామ అడ్రస్‌కు పంపించాలి.