Jangaon: ఆకట్టుకున్న శ్రీకృష్ణ రాయబారం నాటకం
జనగామ (CLiC2NEWS): జనగామలో మీనాక్షి ఫంక్షన్ హాల్ లో మంగళవారం ప్రదర్శించిన శ్రీకృష్ణ రాయబారం నాటకం వీక్షకులను ఆకట్టుకుంది. జానపద కలలను బ్రతికించుకోవాలని, వాటిని భావితరాలకు అందించాలని ఉద్దేశంతో ఈ నాటకాన్ని ప్రదర్శించామని పాత్రధారులు తెలిపారు. జనగామకు చెందిన పలువురు కళాకారులు ఒక జట్టుగా ఏర్పడి వారు నేర్చుకున్న కళలకు ప్రాణం పోశారు.

ఈ నాటకంలో శ్రీకృష్ణ పాత్రలో ప్రముఖ పండితులు అయ్యప్ప శాస్త్రి , కర్ణుడిగా ప్రధానోపాధ్యాయులు ఎక్క ల దేవి వెంకటేశ్వర్లు, ధర్మరాజుగా సీనియర్ జర్నలిస్ట్ కొండ శ్రీనివాస్ పాత్రలు పోషించారు. ఈ నాటక ప్రదర్శన ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.
అనంతరం సీనియర్ జర్నలిస్ట్ కొండ శ్రీనివాస్ (ధర్మరాజు పాత్రధారి) మాట్లాడుతూ అంతరించిపోతున్న కలలను భావితరాలను అందించే ఉద్దేశంతో ఈ నాటక ప్రదర్శనలు చేస్తున్నామని, ప్రభుత్వం అంతరించిపోతున్న కళలను బతికించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

Also Read: `ఎమ్మెల్సీ`కి రాజీనామా చేస్తా: కవిత