జపాన్- భారత్ సహజ భాగస్వాములు..
ప్రధాని నరేంద్ర మోడీ

టోక్యో (CLiC2NEWS):జపాన్- భారత్ సహజ భాగస్వాములు అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. జపనీయుల భారీ ఇన్వెస్ట్మెంట్స్ భారత్ అభివృద్ధి లో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. జపాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ సోమవారం టోక్యో లో ప్రవాస భారతీయులు నిర్వహించిన కార్య్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మోడీ మాట్లాడుతూ.. భారత్ అభివృద్ధి లో జపాన్ కీలక పాత్ర పోషిస్తుంది అని అన్నారు.
ఈ పర్యటనలో భారత్, అమెరికా, ఆస్ట్రియా, జపాన్ కలిసి ఏర్పాటు చేసిన క్వాడ్ కూటమి సదస్సులో ప్రధాని మోడీ పాల్గొన్నారు.