జెఇఇ అడ్వాన్స్డ్ షెడ్యూల్..
JEE ADVANCE: దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటి కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే జెఇఇ అడ్వాన్స్డ్ పరీక్షకు దరఖాస్తులను ఈ నెల 23 నుండి స్వీకరించనున్నారు. ఈ పరీక్షను రాష్ట్రంలోని 13 పట్టణాలలో నిర్వహిస్తారు. మెయిన్స్ రాసిన వారిలో మెరిట్ ఆధారంగా 2.5 లక్షల మంది విద్యార్థులను అడ్వాన్స్డ్ కు క్వాలిఫై అవుతారు. మే నెల 18వ తేదీన జెఇఇ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహిస్తారు. మే 11న అడ్మిట్ కార్డులు విడుదల చేయనున్నారు. దరఖాస్తులను స్వీకరించేందుకు చివరి తేదీ మే 2వరకు ఉంది. ఫీజు మే 5వ తేదీ లోపు చెల్లించాల్సి ఉంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్దతిలో అడ్వాన్స్డ్ పరీక్షను నిర్వహిస్తారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహిస్తారు. అభ్యర్థులు రెండు సెషన్లకు హాజరుకావాలి. ప్రాథమిక కీ మే 25న విడుదలౌతుంది. జూన్ 2వ తేదీన ఫలితాలు విడుదల చేయనున్నారు.