విశాఖలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

విశాఖపట్టణం (CLiC2NEWS): విశాఖలోని రూరల్ ఏజన్సీలో కొయ్యూరు మండలం వద్ద జీపు లోయలో పడిపోయింది. ఈప్రమాదంలో ఇద్దరు ఘటానా స్థలంలోనే మృతిచెందారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో జీపులో పదిమంది ప్రయాణిస్తున్నారు. గాయపడిన వారిని స్థానిక అసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.