పార్టీ ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తా.. జీవితా రాజశేఖర్

మోత్కూరు (CLiC2NEWS): రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో పోటీచేయాలని ఉందని జీవితా రాజశేఖర్ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర యాదాద్రి జిల్లా మోత్కూరు పొడిచేడుకు చేరుకున్న బిజెపి అధ్యక్షడు బండి సంజయ్‌తో పాటు జీవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీచేయాలని ఉందని, పార్టీ ఆదేశిస్తే ఎక్కడినుండైనా పోటీ చేస్తానని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీయే దేశాన్ని కాపాడగలరని నమ్మి బిజెపిలో చేరానని వివరించారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుగా బండి సంజయ్ పార్టీని ముందుకు తీసుకెళ్లున్నారన్నారు. ఇద్దరు ఆడపిల్లల తల్లిగా మహిళల కష్టాలు తెలిసిన దాన్ని. రాష్ట్రంలో టిఆర్ ఎస్ ప్రభుత్వం చేస్తున్న పాలన ఎలా ఉందో ప్రతిఒక్కరికీ తెలిసిన విషయమేనని అన్నారు. పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించి.. పార్టీ కార్యక్రమాలకు హాజరవుతాన్నారు. ప్రజా సంగ్రామ యాత్రకు మద్దతు తెలిపేందుకే పాదయాత్రలో పాల్గొన్నానని జీవితా రాజశేఖర్ అన్నారు.