మెదడు సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్న జిన్‌పింగ్‌!

సంప్ర‌దాయ వైద్యానికే మొగ్గు చూపిన చైనా అధ్య‌క్షుడు

బీజింగ్ (CLiC2NEWS): చ‌ఐనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్ మెద‌డు సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. ఆయ‌న‌కు సెరిబ్ర‌ల్ ఎన‌రిజం వ్యాధి ఉన్న‌ట్లు తేలింది. ఈ స‌మ‌స్య‌తో గ‌త ఏడాది దిసెంబ‌రులో ఆసుప‌త్రిలో చేరాల్సివ‌చ్చింద‌ని ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

ప్ర‌స్తుతం జిన్‌పింగ్ ఆధునిక ప‌ద్ధ‌తుల్లో చికిత్స తీసుకోకుండా చైనీయుల సాంప్ర‌దాయ వైద్య చికిత్స‌ను తీసుకుంటున్నారు. స‌ర్జ‌రీకి బ‌దులుగా ఆయ‌న ట్రెడిష‌న్ ట్రీట్‌మెంట్‌ను తీసుకుంటున్నారు. దీని ద్వారా మెదుడులోని ర‌క్త‌నాళాలు మెత్త‌బ‌డి వ్యాధి త‌గ్గే అవ‌కాశాలు ఉన్నాయి. కాగా 2019 మార్చిలో ఇట‌లీ, ఫ్రాన్స్ ప‌ర్య‌ట‌న పంమంలొ ఆయ‌న స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యార‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది.

Leave A Reply

Your email address will not be published.