Nujiveedu: ఈ నెల 31వ తేదీన జాబ్మేళా..

నూజివీడు (CLiC2NEWS): పట్టణంలోని శ్రీ శారద కళాశాలలో అక్టోబర్ 31వ తేదీన జాబ్మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ తెలిపారు. ఎపి నైపుణ్యాభివృద్ధి సంస్త, సిడాప్, జిల్లా ఉపాధి సంస్థ ఆధ్యవర్యంలో ఈ జాబ్మేళా నిర్వహించనున్నారు.
మొత్తం 12 కంపెనీలకు చెందిన ప్రతినిధులు రానున్నారు. దాదాపు 850 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు సమాచారం. కావును నిరుద్యోగ యువత ఈ అవకాశం వినియోగించుకోగలరని జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి గంటా సుధాకర్ తెలిపారు. ఉదయం 9 గంటల నుండి జాబ్మేళా నిర్వహించబుడుతుంది.