డిగ్రీ ఉత్తీర్ణులైన వారికి శుభవార్త..

RBI: డిగ్రీ ఉత్తీర్ణులైన వారు కేంద్ర బ్యాంకులో కొలువులు సాధించవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) లో 450 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు సెప్టెంబర్ 1, 2023 నాటికి డిగ్రీ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు 28 ఏళ్లకు మించరాదు. ఒబిసిలకు మూడేళ్లు.. ఎస్టి, ఎస్సి అభ్యర్థులకు అయిదేళ్ల చొప్పున సడలింపు ఉంది. పోస్టులకు ఎంపికైన వారికి ప్రారంభంలోనే రూ. 487,849 వేతనం చెల్లించనున్నట్లు సమాచారం.
దేశవ్యాప్తంగా ఉన్న 18 ప్రాంతీయ కార్యాలయాల్లో 450 అసిస్టెంట్ పోస్టులకు రెండు దశల ఎంపిక ప్రక్రియ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ రాత పరీక్ష, మెయిన్స్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అభ్యర్థులకు దరఖాస్తు చేసుకున్న కార్యాలయం ఉన్న రాష్ట్రానికి సంబంధించిన భాషలో ప్రావీణ్యం తప్పనిసరిగా ఉండాలి. దీంతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. పూర్తి సమాచారం కొరకు https://www.rbi.org.in/ వెబ్సైట్ చూడగలరు.