ఎపి సెంట్రల్ వర్సిటీలో ఉద్యోగావకాశాలు..
అనంతపురం సెంట్రల్ యూనివర్సిటి ఆఫ్ ఆంధ్రప్రదేశ్.. ఔట్సోర్సింగ్ / తాత్కాలిక ప్రాతిపదికన 19 నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను కోరుతున్నారు. దరఖాస్తులను ఈ నెల 31వ తేదీలోపు పంపించాల్సి ఉంది. మెయిల్ arcuap@gmail.com ద్వారా దరఖాస్తులను పంపించాలి. విద్యార్హతలు, ఉద్యోగానుభవంతో ఎంపిక జరుగుతుంది.
డాక్టర్ -2
అకౌంటెంట్ -1
డేటా ఆపరేటర్ -2
అసిస్టెంట్ -1
ల్యాబ్ అసిస్టెంట్ (కంప్యూటర్ల్యాబ్ )-4
ల్యాబ్ అసిస్టెంట్ (జాగ్రఫి అండ్ స్పేస్ సైన్స్)-1
హాస్టల్ కేర్ టేకర్ (బాయ్స్ &గర్ల్స్) -4
నర్స్ -1
హిందీ ట్రాన్స్ లేటర్ కమ్ టైపిస్ట్ -1
టెక్నికల్ అసిస్టెంట్ (డేటా సెంటర్ )-1
ప్లంబర్ -1
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో పదో తరగతి/ ఇంటర్/ ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, జిఎన్ ఎం/ బిఎస్ సి నర్సింగ్/ ఎమ్ ఎస్సి నర్సింగ్, బిటెక్/ బిఎ/ ఎంసిఎ, ఎమ్ ఎస్సి, ఎంఇ, బికాం/ ఎంకాం, ఎంబిబిఎస్, ఎండితో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.