కులవృత్తుల వారికి రూ.లక్ష ఆర్ధిక సాయం.. దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 20

హైదరాబాద్ (CLiC2NEWS): బిసి, చేతి, కులవృత్తుల కుటుంబాలకు రూ. లక్ష ఆర్ధిక సాయం కోసం ఈ నెల 20వ రకు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇప్పటివరకు ఆర్ధిక సాయం కోసం 53వేల దరఖాస్తులు వచ్చాయని ఆయన వెల్లడించారు. కుల వృత్తులకు ఉపయోగపడే ముడిసరుకులు, పరికరాల కొనుగోలుకు రూ.లక్ష ఆర్ధిక సహాయం ఉపయోగపడుతుందన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి 2021 ఏప్రిల్ నుండి జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సైతం చెల్లు బాటు అవుతాయని మంత్రి తెలిపారు. దరఖాస్తును మొబైల్ నుండి పూర్తి చేయడానికి వీలుగా రూపొందించారని.. దరఖాస్తుల విషయంలో ఎవరినీ ప్రత్యక్షంగా కలవాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు.
బిసి ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్ వసతి గృహాల్లో సీట్ల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మంత్రి గంగుల తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 703 వసతి గృహాలకు విద్యార్థులు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకొని నేరుగా ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు. విద్యార్థుల కోసం https//bchostels//cgg. gov. in వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు