జూనియర్‌ కళాశాలలు 36 కస్తూర్బాలు.. స‌ర్కార్ ఉత్తర్వులు జారీ

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ‌లోని 36 కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో (కెజిబివి) ఈ ఏడాది నుంచి ఇంటర్‌ విద్యా బోధన కూడా జరుగనుంది. ఈ మేరకు కాష్ట్రంలోని 36 కేజీబీవీలను జూనియర్ కళాశాలలుగా స్థాయి పెంచుతూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యాలయాల్లో 2021-22 నుంచి 11వ త‌ర‌గ‌తి, 2022-23 నుంచి 12వ త‌ర‌గ‌తి ప్రారంభం కానున్నాయి. వీటిలో తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలో బోధన జరుగనుంది.

  • ఆదిలాబాద్ అర్బన్, భీంపూర్, భద్రాచాలం, టేకుమట్ల, బీబీపేట, రఘునాథపాలెం, చింతలమానెపల్లి, కెరమెరి – రెబ్బెన, సిర్పూర్-యూ, గంగారం, జైపూర్, పెంట్లవెల్లి, శెట్టిపాలెం, కృష్ణ, నర్సాపూర్-జీ, అంతర్గాం, సిరిసిల్ల, మద్దిరాల, అమరచింత, ఐనవోలు, అడ్డగూడురులోని కేజీబీవీల్లో 40 సీట్ల చొప్పున ఎంపీసీ, బైపీసీ కోర్సులు ప్రారంభం కానున్నాయి.
  • బూర్గంపహాడ్, పల్మెల, భూపాలపల్లి, మహాముత్తారం, మొగుళ్లపల్లి, రేగొండ, సిర్పూర్-టీ, మాణిక్యాపూర్, గండీడ్, మహమ్మదాబాద్, ములుగు, తాడ్వాయి, మహేశ్వరం, కొందురు, సిద్దిపేట అర్బన్ లోని కస్తూర్బా విద్యాలయాల్లో సీఈసీ, ఎంపీహెచడబ్ల్యూ కోర్సులు ప్రారంభం అవుతాయి.
Leave A Reply

Your email address will not be published.