తమిళనాడులోని ఎన్ఎల్‌సిలో పోస్టులు

NLC: సైంటిఫిక్, మైక్రోబయాలజి, మెకానికల్ , సివిల్ విభాగాలలో ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ దరఖాస్తులు కోరుతుంది. మొత్తం 14 జూనియర్ ఇంజినీర్ పోస్టులు, ఎలక్ట్రీషియన్ పోస్టులు 7 ఉన్నాయి.
జూనియర్ ఇంజినీర్ పోస్టులు
నెలకు వేతనం రూ. 38వేలు అందుతుంది. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఈ నెల 30వ తేదీ లోపు పంపించాల్సి ఉంటుంది.
దరఖాస్తు రుసుం రూ. 595గా నిర్ణయించారు. ఎస్‌టి, ఎస్‌సి, పిడబ్ల్యుబిడి, ఎక్స్-సర్వీస్‌మెన్ లకు రూ. 295 గా నిర్ణయించారు.
ఎలక్ట్రీషియన్ పోస్టులు
టెన్త్, ఐటిఐ, సంబంధిత విభాగంలో పుల్‌టైం, డిప్లొమా, డిగ్రీతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి . అభ్యర్థుల వయస్సు 30ఏళ్లకు మించకూడదు.
ఎలక్ట్రీషియన్ సూపర్‌వైజర్ పోస్టులకు అన్ రిజర్వ్‌డ్/ ఇడబ్ల్యు ఎస్ / ఒబిసిలకు దరఖాస్తు రుసుం రూ. 595గా నిర్ణయించారు. ఎస్‌టి, ఎస్‌సి, పిడబ్ల్యుబిడి, ఎక్స్-సర్వీస్‌మెన్ లకు రూ. 295 గా నిర్ణయించారు.
ఎలక్ట్రీషియన్ కు అన్ రిజర్వ్‌డ్/ ఇడబ్ల్యు ఎస్ / ఒబిసిలకు రూ. 486 గా ఉంది. ఎస్‌సి/ ఎస్‌టి రూ. 236గా నిర్ణయించారు.
ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాకలు https://www.nlcindia.in/ వెబ్‌సైట్ చూడగలరు.