ఎన్‌టిపిసిలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

NTPC: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌టిపిసి)లో ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన 50 జూనియర్ ఎగ్జిక్యూటివ్ (బయోమాస్) పోస్టుల భర్తీ చేయనున్నారు. బిఎస్‌సి డిగ్రీ (అగ్రికల్చరల్ సైన్స్)తో పాటు పని అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 27 ఏళ్లకు మించకూడదు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు వేతనం రూ.40వేలు అందుతుంది. దరఖాస్తులను ఈ నెల 28వ తేదీలోపు పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.300. ఎస్‌టి, ఎస్‌సి, పిడబ్ల్యుబిడి, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళలకు ఫీజు మినహాయింపు ఉంటుంది. పూర్తి వివరాలకు https://ntpc.co.in/ వెబ్‌సైట్ చూడగలరు.