ఒక నటుడిగా కాక పునీత్‌కు మంచి స్నేహితుడిగా వచ్చా.. ఎన్టిఆర్

బెంగళూరు (CLiC2NEWS): దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు కర్ణాటక ప్రభుత్వం ‘కర్నాటక రత్న’ పురస్కారం అందించింది. 67వ కర్ణాటక రాజ్యోత్సవం సందర్బంగా బెంగళూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్‌తో పాటు జూనియర్ ఎన్టిఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టిఆర్ మాట్లాడుతూ..పునీత్ నవ్వులో ఉన్న స్వచ్ఛత, సిరిని మరెక్కడా చూడలేదని.. అహంకారాన్ని పక్కనపెట్టి, యుద్ధం చేయకుండానే రాజ్యాన్ని జయించిన వ్యక్తి పునీత్ అన్నారు.కన్నడ భాషలో ఎన్టిఆర్ అనర్గళంగా మాట్లాడారు. ఈ కార్యక్రమానికి నటుడిగా సాధించిన అర్హతతో కాకుండా పునీత్‌కు మంచి స్నేహితుడిగా వచ్చానని ఎన్టిఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పునీత్‌కు ‘కర్ణాటక రత్న’ పురస్కారాన్ని అందజేశారు. ఈ పురస్కారాన్ని పునీత్ రాజ్‌కుమార్ సతీమణి అశ్విని పునీత్‌కు సిఎం బసవరాజబొమ్మై, రజనీకాంత్, ఎన్టిఆర్, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సుధామూర్తి అందజేశారు.
Very nice post. I just stumbled upon your blog and wanted to say that I’ve really enjoyed browsing your blog posts. In any case I’ll be subscribing to your feed and I hope you write again soon!