ఇస్రోలో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు

ISRO: ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ బెంగళూరులో జూనియర్ రిసెర్చ్ ఫెలో, రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు భర్తీ చేయనున్నారు. మొత్తం 23 పోస్టులు కలవు. వీటిలో జూనియర్ రిసెర్చ్ -21 ఉండగా.. రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు 2 ఉన్నాయి. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. దరఖాస్తులను ఏప్రిల్ 20వ తేదీ లోపు పంపించాల్సి ఉంది. ఎంఇ, ఎంటెక్, ఎంఎస్‌సి లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు.
జూనియర్ రిసెర్చ్ ఫెలో ఉద్యోగులకు నెలకు వేతనం రూ. 37వేలు అందుతుంది. 20-04-2025 నాటికి అభ్యర్థులకు 28 ఏళ్లు మించకూడదు.
రిసెర్చ్ అసోసియేట్ అభ్యర్థులకు వేతనం రూ.58వేలు అందుతుంది. అభ్యర్థులకు 35 ఏళ్లు ఉండాలి. ఒబిసిలకు మూడేళ్లు.. ఎస్‌సి/ ఎస్‌టి అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు వర్తిస్తుంది.