ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జూనియర్ టెక్నీషియన్ పోస్టులు

మెదక్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జూనియర్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఈ ఫ్యాక్టరీలో మొత్తం 20 పోస్టులు ఉన్నాయి. వీటిని ఒప్పంద ప్రాతిపదికన ఏడాది కాలానికి భర్తీ చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతున్నారు. దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో పంపించాల్సి ఉంది.
పోస్టుల వివరాలు:
జూనియర్ టెక్నీషియన్ (ఎగ్జామినర్ ఇంజినీరింగ్ ) -10
ఫిట్టర్ (ఎలక్ట్రానిక్స్)లో ఎన్‌టిసి/ ఎన్ ఎసి సర్టిఫికెట్, సంబంధిత రంగలో రెండేళ్ల పని అనుభవం ఉండాలి. వయస్సు 30 ఏళ్లకు మించకూడదు. ఒబిసి అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్‌టి, ఎస్‌సిలకు ఐదేళ్లు , దివ్యాంగులకు పదేళ్లు, మాజి సైనికులకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.
జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్ జనరల్)- 10
ఫిట్టర్ జనరల్/ మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెన్స్/ టూల్ అండ్ డై మేకర్‌లో ఎన్ ఎసి/ ఎన్‌టిసి సర్టిఫికెట్ ఉండాలి. సంబంధిత రంగంలో రెండేళ్ల పని అనుభవం అవసరం.
సాంకేతిక కోర్సులను జనరల్ అభ్యర్థులు 65 % మార్కులతో పూర్తి చేయాలి. ప్రత్యేక వర్గాలకు చెందిన వారికి 55% ఉండాలి. రెండు పోస్టులకు బిఎంపి ట్యాంకులకు సంబంధించిన పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు.
అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు ఉండాలి.ఒబిసి అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్‌టి, ఎస్‌సిలకు ఐదేళ్లు , దివ్యాంగులకు పదేళ్లు, మాజి సైనికులకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.
దరఖాస్తులు పంపించేందుకు చివరి తేదీ మే 14. దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో పంపించాలి. డిప్యూటి జనరల్ మేనేజర్ / హెచ్ ఆర్, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరి మెదక్, ఎద్దుమైలారం, సంగారెడ్డి , హైదరాబాద్ 502205. చిరునామాకు దరఖాస్తులు పంపించాల్సి ఉంది.
దరఖాస్తు ఫీజు రూ.300గా నిర్ణయించారు. ఎస్‌సి, ఎస్‌టి, దివ్యాంగులు, మాజి సైనికోద్యోగులు, మహిళలకు ఫీజు లేదు.
ధ్రువ పత్రాల పరిశీలన ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుంది. ధ్రవపత్రాల పరిశీలన అనంతరం ట్రేడ్ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. దీన్ని ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ మెదక్, ఎద్దుమైలారం , సంగారెడ్డిలో నిర్వహిస్తారు. ట్రేడ్ టెస్ట్‌లో ప్రతిభ చూపిన వారిని తుది ఎంపిక చేస్తారు.
ట్రేడ్ టెస్ట్ సమయంలో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ను సమర్పించాలి.
కాల్ లెటర్, ట్రేడ్ టెస్ట్ తేదీ, వివరాలు, తుది ఫలితాల వివరాలు వెబ్‌సైట్లోనే ప్రకటించడం జరుగుతుంది