జూరాల ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తి నీటి విడుదల

మహబూబ్నగర్ (CLiC2NEWS):మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాలు కురుస్తున్న వర్షాలతో భారీగా వరద వస్తుండటంతో అధికారులు సీజన్లో మొదటిసారిగా జూరాల ప్రాజెక్ట్ గేట్లు ఎత్తారు. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు 90 శాతం నిండాయి. దాంతో ఎగువ నుంచి వచ్చి వచ్చిన వరదను వచ్చినట్లుగా జూరాలకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ నుంచి జూరాలకు 61,700 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు ఇవాళ (శనివారం) ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తారు. స్పిల్ వే ద్వారా కూడా దిగువనకు 20,760 క్యూసెక్కులు అలాగే విద్యుత్ ఉత్పత్తి ద్వారా 36,659 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 318.340 మీటర్లకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.296గా ఉంది.