ఆంధ్ర‌ప్ర‌దేశ్ కొత్త గ‌వ‌ర్న‌ర్‌గా జ‌స్టిస అబ్దుల్ న‌జీర్

ఢిల్లీ (CLiC2NEWS): దేశంలోని ప‌లు రాష్ట్రాల‌కు నూత‌న గ‌వ‌ర్న‌ర్‌ల‌ను కేంద్రం నియ‌మించింది. మొత్తం 12 మంది గ‌వ‌ర్నల నియామ‌కానికి రాష్ట్రప‌తి ఆమోదం ఆమోదం తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కొత్త గ‌వ‌ర్న‌ర్‌గా జ‌స్టిస అబ్దుల్ న‌జీర్ నియ‌మితుల‌య్యారు. ప్ర‌స్తుతం ఉన్న బిశ్వ భూష‌ణ్ హ‌రిచంద‌న్.. ఛ‌త్తీస్‌గ‌ఢ్ గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మితుల‌య్యారు. జ‌స్టిస్ అబ్దుల్ న‌జీర్ గ‌తంలో సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా ప‌నిచేశారు. ఆయోధ్య తీర్పు ఇచ్చిన ఐదుగురు జ‌డ్జిల బెంచ్‌లో ఆయ‌న ఒక‌రు. అదేవిధంగా ట్రిపుల్ త‌లాక్ చెల్ల‌ద‌ని తీర్పు ఇచ్చిన సుప్రీం ధ‌ర్మాస‌నంలో జ‌స్టిస్ న‌జీర్ ఒక‌రు. ఆయ‌న క‌ర్ణాట‌క హైకోర్టు అద‌న‌పు జ‌డ్జిగా ప‌నిచేశారు. 2017వ సంవ‌త్స‌రంలో దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానంలో జ‌డ్జిగా ప‌దోన్న‌తి ల‌భించింది.

12 మంది నూత‌న గ‌వ‌ర్న‌ర్‌ల జాబితా..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ – జ‌స్టిస్ అబ్దుల్ న‌జీర్‌
ఛ‌త్తీస్‌గ‌ఢ్ – బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌
మ‌హారాష్ట్ర – ర‌మేశ్ బైస్‌
హిమాచ‌ల్ ప్ర‌దేశ్ – శివ్ ప్ర‌తాప్ శుక్లా
అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్ – లెప్టినెంట్ జ‌న‌ర‌ల్ కైవ‌ల్య త్రివిక్ర‌మ్ ప‌ర్నాయ‌క్‌

సిక్కిం -ల‌క్ష్మ‌ణ్ ప్ర‌సాద్ ఆచార్య‌
ఝార్ఖండ్ – సి.పి. రాధాకృష్ణ‌న్‌
అసోం – గులాబ్ చంద్ క‌టారియా
మ‌ణిపూర్ – అనుసూయ‌
నాగాలాండ్ – గ‌ణేశ‌న్‌
మేఘాల‌య – ఫాగు చౌహాన్‌
బిహార్ – రాజేంద్ర విశ్వ‌నాథ్‌
ల‌ద్దాఖ్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ – బిడి మిశ్రా

Leave A Reply

Your email address will not be published.