డాలర్ శేషాద్రి భౌతికకాయానికి నివాళులర్పించిన జస్టిస్ ఎన్.వి.రమణ

తిరుపతి(CLiC2NEWS) : తిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీ డాలర్ శేషాద్రి భౌతిక కాయానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నివాళులర్పించారు. డాలర్ శేషాద్రి గుండెపోటుతో సోమవారం మృతిచెందారు. ఆయన భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఎపి డిప్యూటి సిఎం నారాయణ స్వామి, టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ జవహర్ రెడ్డి, అదనపు ఈఓ ధర్మారెడ్డి పలువురు డాలర్ శేషాద్రి నివాసం వద్దకు చేరుకుని ఆయన పార్థివదేహంకు నివాళులర్పించారు. తిరుపతిలోని సత్యహరిశ్చంద్ర శ్మశానవాటికలో ఈరోజు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.