సుప్రీంకోర్టు నూతన సిజెఐగా జస్టిస్ యు.యు.లలిత్ నియామకం

ఢిల్లీ (CLiC2NEWS): భారత సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్న సిజెఐ ఎన్.వి.రమణ పదవీకాలం ఈనెల 26వ తేదీతో ముగియనుండటంతో జస్టిస్ యు.యు. లలిత్ పేరును సిఫారసు చేశారు. నూతన సిజెఐ నియామకానికి సంబంధించిన దస్త్రంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. ప్రస్తుతం ఉన్న సిజెఐ జస్టిస్ ఎన్‌వి రమణ పదవీ విరమణ చేసిన తరువాత రోజు యు.యు. లలిత్ 49వ సిజెఐగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌న విడుదల చేసింది. అయితే జస్టిస్ యు.యు.లలిత్ కు నవంబర్ 8వ తేదీతో 65 ఏళ్లు పూర్తి కానుండటంతో ఆయన మూడు కేవలం మూడు నెలలు మాత్రమే సిజెఐగా కొనసాగనున్నారు.