నేటి నుండి కాకతీయ వైభవ సప్తాహం ప్రారంభం..
వరంగల్ (CLiC2NEWS): తెలంగాణలో నేటి నుండి 7 రోజులపాటు వరంగల్, హైదరాబాద్‌లలో కాకతీయ వైభవ సప్తాహాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంతో శతాబ్దాల అనుబంధమున్న కాకతీయుల చరిత్ర, పాలనా వైభవం, కళావిశిష్టతలను భావితరాలకు తెలపే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ కాకతీయ వైభవ సప్తాహం నిర్వహిస్తోంది. వరంగల్‌లో ఈ ఉత్సవాలను మంత్రి శ్రీనివాసగౌడ్ ప్రారంభించారు.
కాకతీయుల కారసుడు మహారాజా కమల్‌చంద్ర భంజ్‌దేవ్ ఈ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. భద్రకాళి ఆలయ స్వాగత ద్వారం వద్ద ఆయనకు మంత్రులు శ్రీనివాసగౌడ్, సత్వవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, జిల్లా అధికారులు స్వాగతం పలికారు. ఉత్సవాల్లో భాగంగా కాకతీయ వైభవంపై ఏడురోజుల పాటు నాటకాలు, సదస్సులు, విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారు.