Kalki 2898 AD: రూ.100కే ‘కల్కి’ టికెట్..

హైదరాబాద్ (CLiC2NEWS): సినీ ప్రియులకు శుభవార్త. రూ.100 కే కల్కి సినిమాను చూసే అవకాశం. ఈ నెల 2వ తేదీ నుండి 9వరకు కల్కి 2898 ఎడి సినిమాని చూడొచ్చని నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ప్రకటించింది. ఈ ఆఫర్ దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో వర్తిస్తుంది. షరతులు వర్తిస్తాయని పేర్కొంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం జూన్ 27న విడుదలై సినీ ప్రియులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ఈ ఏడాదిలో రూ. 1100 కోట్లు రాబట్టిన చిత్రమిదే.