Kalki 2898 AD: బుజ్జిని పరిచయం చేసిన ప్రభాస్
హైదరాబాద్ (CLiC2NEWS): హీరో ప్రభాస్ బుజ్జిని పరిచయం చేయబోతున్నానని పోస్ట్ పెట్టగానే అబిమానులు బుజ్జి ఎవరా.. అని ఆసక్తిగా ఎదురుచూశారు. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ వెంట్‌లో బుజ్జిని ప్రభాస్ పరిచయం చేశారు. ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి 2898 ఎడి’ చిత్రం ప్రచారంలో భాగంగా ఇటీవల ఆ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్‌పై నెటిజ న్లు తమదైన శైలిలో కథలల్లేశారు. తాజాగా నగరంలో జరిగిన ఈవెంట్‌లొ ప్రభాస్ బుజ్జిని పరిచయం చేశారు.