జలమండలిలో ఘనంగా కాళోజీ జయంతి
హైదరాబాద్(CLiC2NEWS): తెలంగాణ సమాజాన్ని విశేషంగా చైతన్యపరిచి, ఈ ప్రాంతం కోసం నిరంతరం తపనపడిన పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు 107వ జయంతి కార్యక్రమం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఘనంగా జరిగింది. జలమండలి అధికారులు, ఉద్యోగులు కాళోజీ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ యాస, భాష, సంస్కృతి పట్ల కాళోజీ చూపించిన తపనను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ డా.ఎం.సత్యనారాయణ, పర్సనల్ డైరెక్టర్ శ్రీధర్ బాబు, రెవెన్యూ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, సీజీఎంలు, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.