భూవివాదం కేసులో కెసిఆర్ అన్న కుమారుడు అరెస్టు

హైద‌రాబాద్ (CLiC2NEWS): మ‌న్నెవాడ భూవివాదం కేసులో కెసిఆర్ అన్న కుమారుడు క‌ల్వ‌కుంట్ల క‌న్నారావును పోలీసులు అరెస్టు చేశారు. 2 ఎక‌రాల భూమిని క‌బ్జాకు య‌త్నించిన‌ట్లు ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మ‌న్నెగూడ భూవివాదంలో త‌ల‌దూర్చి ప‌లువురిపై దాడిచేసిన ఘ‌ట‌న‌లో క‌న్నారావుతోపాటు మ‌రో 35 మందిపై ఆదిభ‌ట్లు పోలీస్ స్టేష‌న్లో కేసు న‌మోదైంది. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం అత‌నిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో అత‌డు ముంద‌స్తు బెయిల్ కోసం ప్ర‌య‌త్నించినా..హైకోర్టు తిర‌స్క‌రించింది. ఇబ్ర‌హీంప‌ట్నం కోర్టు క‌న్నారావుకు 14 రోజుల జ్యుడిషియ‌ల్ రిమాండ్ విధించ‌గా.. చ‌ర్ల‌ప‌ల్లి జైలుకు త‌ర‌లించారు.

Leave A Reply

Your email address will not be published.