వైభవంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణ మహోత్సవం
![](https://clic2news.com/wp-content/uploads/2024/01/mallana-marriage.jpg)
కొమురవెల్లి (CLiC2NEWS): కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఎంపిలోని ఉజ్జయిని పిఠాధిపతి సిద్ధలింగ రాజదేశికేంద్ర శివాచార్య మహా స్వామి పర్యవేక్షణలో వేద పండితులు ఈ క్రతువును నిర్వహించారు.
ఈ మహోత్సవంలో వధువుల తరఫున మహాదేవుని వంశస్థులు కన్యాదానం చేయగా.. వరుడి తరపున పడిగన్నవారి వంశస్థులు స్వీకరించారు. తదుపరి బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలను మల్లికార్జున స్వామి వివాహమాడాడు.
స్వామి, అమ్మవార్లకు తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఈ మహోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. మల్లన్న వివాహం సందర్భంగా కొమురవెల్లి ఆలయాన్ని నిర్వహాకులు సర్వాంగ సుందరంగా అలంకరించారు. పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు.