రాజ్యసభకు కమల్‌హాసన్ నామినేషన్
Kamal Haasan files nomination for Rajya Sabha
Kamalhaasan: ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టి అధినేత కమల్ హాసన్ రాజ్యసభకు నామినేషన్ సమర్పించాడు. ఆయనతో పాటు మరో ముగ్గురు డిఎంకె నేతలు రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. కమల్ బుధవారం వేయాల్సిన నామినేషన్.. తన సినిమా థగ్‌లైఫ్ చిత్రం గురువారం విడుదలవడంతో నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఇటీవల తన చిత్రం థగ్‌లైఫ్ ఈవెంట్‌లో కన్నడ భాషపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.
థగ్‌లైప్ సినమా ఈవెంట్‌లో కమల్ చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో సినిమా విడుదలకు ఎదురుదెబ్బ తగితింది. సినిమా ఈ వెంట్‌లో కమల్‌హాసన్ మాట్లాడుతూ తమిళం నుండే కన్నడ పుట్టిందని వ్యాఖ్యానించారు. కన్నడ ప్రజలు ఆ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఆ చిత్రాన్ని కర్ణాటకలో నిషేధించాలని కోరుతూ ఆ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హైకోర్టును ఆశ్రయించింది.