Kamareddy: మద్యం షాపులకు 166 దరఖాస్తులు

జిల్లాలో 49 వైన్ షాప్‌లకు ఇప్పటివరకు అందిన దరఖాస్తులు...

కామారెడ్డి (CLiC2NEWS): 2025–2027 సంవత్సరాలకు మద్యం దుకాణాల అనుమతుల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో భాగంగా సోమవారం (13.10.2025) వరకు మొత్తం 166 దరఖాస్తులు అందినట్లు కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ సూపరింటేడెంట్ హనుమంత రావు తెలిపారు.

జిల్లాలోని వివిధ స్టేషన్ పరిధుల వారీగా వివరాలు

  • కామారెడ్డి స్టేషన్ పరిధిలో 15 వైన్ షాప్‌లకు 45 దరఖాస్తులు
  • దోమకొండ స్టేషన్ పరిధిలో 8 వైన్ షాప్‌లకు 25 దరఖాస్తులు
  • ఎల్లారెడ్డి స్టేషన్ పరిధిలో 7 వైన్ షాప్‌లకు 19 దరఖాస్తులు
  • బాన్సువాడ స్టేషన్ పరిధిలో 9 వైన్ షాప్‌లకు 43 దరఖాస్తులు
  • బీచుకుందా స్టేషన్ పరిధిలో 10 వైన్ షాప్‌లకు 34 దరఖాస్తులు అందినట్లు తెలిపారు.

మొత్తం‌గా కామారెడ్డి జిల్లాలో 49 వైన్ షాప్‌లకు 166 దరఖాస్తులు అందినట్లు హనుమంతరావు వివరించారు.

Also Read: Kamareddy: బీబీపేట్ పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ

1 Comment
  1. […] Kamareddy: మద్యం షాపులకు 166 దరఖాస్తులు […]

Leave A Reply

Your email address will not be published.