Nirmal: పార్టీ బలోపతానికి అంకితభావంతో పనిచేయాలి

-టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

నిర్మల్ (CLiC2NEWS): నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో సోమవారం నిర్వహించిన సంఘటన్ శ్రీజన్ అభియాన్ నూతన జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షుల ఎంపిక నేపథ్యంలో ఏఐసీసీలు ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లాలోని పరిశీలకులు అజయ్ సింగ్, పిసిసి పరిశీలకులు మిద్దెల జితేందర్, టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, ఖానాపూర్ శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్, మాజీ మంత్రి గడ్డం ఇంద్రకరణ్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారీ, ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రేఖ శ్యామ్ నాయక్, గ్రంథాలయ చైర్మన్ అర్జుమాంద్ అలీ, మాజీ జడ్పీ చైర్మన్ శ్రీమతి ధన్వాన్తరీ, జిల్లా కోఆర్డినేటర్ రాంభూపాల్, లకవత్ దాణపతి, డిసిసి అధ్యక్షులు కూచూరి శ్రీహరి, జిల్లా కేంద్రంలో పర్యటించారు.

అనంతరం మంజులాపూర్ రోడ్డులో ఉన్న మారుతి ఇన్ హోటల్లో మధ్యాహ్నం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో స్థానిక నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు హైకమాండ్ నడుం బిగించిందని, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలుపతం చేయడం కోసం సంఘటన్ శ్రీజన్ అభియాన్ను ప్రారంభించిందని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల్లో గెలిచేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.

Also Read: Kamareddy: మద్యం షాపులకు 166 దరఖాస్తులు

Leave A Reply

Your email address will not be published.