కామారెడ్డిలో బిసి బంద్ విజయవంతం

కామారెడ్డి (CLiC2NEWS): 42 % రిజర్వేషన్లు రక్షించుకోవడమే ధ్యేయంగా బిసి జెఎసి పిలుపు మేరకు  కామారెడ్డి జిల్లా కేంద్రంలో బంద్  విజయవంతంగా పూర్తి అయింది. ఉదయం 4 గంటలకే బిసి సంఘాల నాయకులు, అఖిల పక్ష పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులు బయటికి వెళ్లకుండ అడ్డుకుని బంద్ విజయవంతం చేశారు.

జిల్లా కేంద్రంలో విద్యా సంస్థలు, వ్యాపార, వాణిజ్య, రవాణా, పెట్రోల్ బంక్ లు, సినిమా హాళ్లు, హోటళ్లు పూర్తిగా బంద్ పాటించాయి.

100 మంది బిసి సంఘాల నాయకులు  బైక్ ర్యాలీగా వెళ్లి పట్టణం మొత్తం తిరుగుతూ గవర్నమెంట్ విద్యాసంస్థలు బంద్ చేయించారు. బైక్ ర్యాలీ దేవునిపల్లి, నిజాంసాగర్ చౌరస్థా, రైల్వే స్టేషన్, ధర్మశాల, ఇందిరానగర్, గంజ్, జీపీఎన్, తిలక్ రోడ్డు మీదుగా, నిజాంసాగర్ చౌరస్తా, బస్టాప్ వరకు జరిపారు. అనంతరం బస్టాప్ నుండి ర్యాలీ గా నడుచుకుంటూ వెళ్లి నిజాంసాగర్ చౌరస్తా వద్ద గంట పాటు మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు.

బిసి రాజ్యాధికారమే ధ్యేయంగా భవిష్యత్తు కార్యాచరణ చేపట్టి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని, బీసీలకు 42 శాతం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో రిజర్వేషన్లే ధ్యేయంగా పోరాటాలు చేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ, అఖిలపక్ష రాజకీయ పార్టీ, బహుజన, ప్రజా  సంఘాల నాయకులు నీల నాగరాజు, కుంబాల లక్ష్మణ్ యాదవ్, సాప శివరాములు, పండ్ల రాజు, కుంబాల రవి, ప్రభాకర్ రెడ్డి, కైలాస్ శ్రీనివాస్, మామిండ్ల అంజయ్య, వేణుగోపాల్ గౌడ్, ప్రభాకర్ యాదవ్, గైని శ్రీనివాస్ గౌడ్, లక్ష్మీ నారాయణ, కన్నయ్య, చింతల శంకర్, గణేష్ నాయక్, చాట్ల రాజేశ్వర్, కన్నయ్య, మార్కంటి భూమన్న, కొత్తపల్లి మల్లన్న, సిద్ధిరాములు, చంద్రశేఖర్, నాగరాజ్ గౌడ్, గోవర్ధన్, బాను, మల్లేష్ యాదవ్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

 

బిసి బంద్‌.. ఎక్క‌డికక్క‌డ నిలిచిన ఆర్టీసి బ‌స్సులు

Leave A Reply

Your email address will not be published.