కుమురం భీం జిల్లాలో నిండు గర్భిణీ హత్య!
దహేగాం (CLiC2NEWS): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నెలలు నిండిన నిండు గర్భిణి హత్యకు గురైనట్లు సమాచారం. జిల్లాలోని దహేగం మండలం గెర్రే గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. రాణి అనే తొమ్మిది నెలల గర్భిణీని ఆమె మామ గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశాడు. తన కొడుకు ప్రేమ వివాహం చేసుకుని దూరంగా ఉంటున్న నేపథ్యంలో సత్యనారాయణ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. తన కుమారుడు శేఖర్, రాణి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి కులాలు వేరు కావడంతో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. దీంతో శేఖర్.. భార్యతో కలిసి అత్తవారింట్లోనే ఉంటున్నారు. శేఖర్ , అతని అత్తమామలు ఇంట్లో లేని సమయంలో సత్యనారాయణ.. రాణిని దారుణంగా హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad: ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న మహిళ
[…] […]